వినతి
"విన్నవి - కన్నవి" అనే అనే శీర్షికతో, అట్లూరి పిచ్చేశ్వర రావు ఆ నాటి పత్రికలో వ్రాసిన వ్యాసాలివి. సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఆయా సమకాలిన ఘటనలపై వ్రాసినవి. వ్యక్తులు పరిస్థితులు మారినా, ఈ నాటికి వర్తించే విమర్శనా, వ్యంగ్యము ఈ రచనలలోని విశిష్టత.
అందులో ఒకటి ఇది.
* * *
" ఇంటా బయటా కూర్చున్నప్పుడూ, తిరుగుతుండగాను కనిపించిన వ్యక్తులు మాట్లాడిన మాటలు ఇవి. సంస్కరించకుండా విన్నవి విన్నట్లు, కన్నవి కన్నట్లు ఒక వరుసా క్రమము ఏర్పరచకుండా మీకు ఒప్పచెబుతున్నా. అయినా వరుసా క్రమము ఏర్పడి వుంటే అందుకు గౌరవం ఆయా వ్యక్తులకే దక్కుతుంది. ఆయా మాటలు నాకు వినబడేంత చేరువగా మాట్లుడుకున్నందుకు వారందరికి ధన్యవాదాలు." - అట్లూరి పిచ్చేశ్వర రావు
రెడ్డేమంటున్నాడు?
గోదావరి వరద బాధితులకి సహాయం
చెయ్యండి.
మా కర్నూలికా వరదలు రావు.
దొడ్డిగుమ్మం గొళ్ళెం వూడదు.
నా సీమ రాయలసీమ కాదండి.
ప్రకాశం అవుతాడంటారా?
దిడ్డిగం వేసి ముడ్డితొ దాటే వారుంటారు.
ఏమో లెండి. బట్టతలలు బట్టతలలే మొకాళ్ళూ,
మోకాళ్ళే
ఎన్ని చెప్పినా ఆయన రాజాకీయనుభవాని
కున్నంత వయసుగూడా లేదాయె వీళ్ళకి.
అబ్బో! మా మంచి విగ్రహం!
ఎంత మంచి కాకపొతే అంతమంది పోలీసులు
కాపలా కాయవలసి వచ్చిందంటారు.
విగ్రాహాలకి ఆగ్రహం వుండదు. ఒకటే
నిగ్రహం.
అదే మౄగ్యం.
మీసాలు లేనివరికి రోసాలు మిక్కుటం.
ఆర్డినెన్సులు పెట్టడంలో అగ్రతాంబూలం మనదే చూడండి.
గోదావరి వరద బాధితులకి సహాయం
చెయ్యండి.
మా కర్నూలికా వరదలు రావు.
దొడ్డిగుమ్మం గొళ్ళెం వూడదు.
నా సీమ రాయలసీమ కాదండి.
ప్రకాశం అవుతాడంటారా?
దిడ్డిగం వేసి ముడ్డితొ దాటే వారుంటారు.
ఏమో లెండి. బట్టతలలు బట్టతలలే మొకాళ్ళూ,
మోకాళ్ళే
ఎన్ని చెప్పినా ఆయన రాజాకీయనుభవాని
కున్నంత వయసుగూడా లేదాయె వీళ్ళకి.
అబ్బో! మా మంచి విగ్రహం!
ఎంత మంచి కాకపొతే అంతమంది పోలీసులు
కాపలా కాయవలసి వచ్చిందంటారు.
విగ్రాహాలకి ఆగ్రహం వుండదు. ఒకటే
నిగ్రహం.
అదే మౄగ్యం.
మీసాలు లేనివరికి రోసాలు మిక్కుటం.
ఆర్డినెన్సులు పెట్టడంలో అగ్రతాంబూలం మనదే చూడండి.