ఓ సర్వాంతర్యామి!
నీకు అంతా తెలుసు. నీకు తెలియందంటూ ఈ చరాచరా ప్రపంచంలొ ఏముంటుంది. ఎట్లా ఉంటుంది. ఉండదు. ఉంటే- అయ్యొ! నువ్వు సర్వాంతర్యామివి.
నువ్వు కొయ్యముక్కవంటాడు చిరంజీవి. కళ్ళు తెరవని పసికూన ఇంకేమనగలడు. నువ్వా కొయ్యముక్కవి. నాకు తెలుసు. భగవాన్ నిన్ను గురించి నాకంతా తెలుసు. పసికూనల మాటలకి కోపం తెచ్చుకోవని తెలుసు. దేవుడరుగుమీద కూర్చుని యెందుకలా నవ్వుతావు. భగవాన్, ఈ చిరుతరగ మందహాసం ఎప్పుడూ నీకు పెట్టని నగగానే అట్టే పెట్టుకుంటావా?
హే చరాచరణ స్థితిలయకారణా!
నా దొకటే ప్రార్ధన. ఒకే ఒక ప్రార్ధన. ఇంక నిన్ను ప్రార్ధించను. అయ్యో కాదు భగవాన్, నాలుక తడబడింది. అంతే - నాలుక నీకు తెలియదూ బుద్దేరిహగిన దగ్గిర్నుంచి రోజూ ప్రార్ధిస్తున్నాగా నిన్నేమీ అడక్కుండా ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామంతో. ఎందుకు ఇదంతా నీతో చెప్పడం? నీకు తెలియదుగనకనా? నేనబద్ధమాడను భగవాన్. అయితే అడిగావనుకో, ఇంటిపెద్ద ఇల్లు మరిచి ఆ పాడుముండ ఏం బాయో-బాయట - వెధవ - భగవాన్! కోపం వస్తోందా, మర్చిపోయాను. భగవాన్ నీకు అందరూ బిడ్డలే. నువు అందరికి తండ్రివే!ఆ. ఆయన, ఆ బాయి యింట్లోనే కాలకృత్యాలన్ని తీర్చుకునేటప్పుడు కోరిన మాట నిజమే. నువ్వు చేసిన మేలు మర్చిపోను బాబు. మర్నాటికి పొన్నుకర్ర టకటకలాడిస్తూ వచ్చిన మనిషి మళ్ళీ ఆ ముండ గడప తొక్కలేదు. చిరంజీవి ఏమంటాడొ తెలుసా భగవాన్. దానికి వేరో ఏదొ కారణం ఉందంట! ఆయన్ని ఆ రాత్రి ఎందరో దబాయించారంట. ఆ ముండ దబాయించేవాళ్ళ వెన్ను చరిచిందంట. భగవాన్, వాడు పసికూన. నాకు తెలియదూ? నిన్ను ప్రార్ధించినదానికి, వరమడిగినదానికి నాకు తెలియదూ? అంతా నీ మహిమే! ఎన్ని లక్షల గుర్రాలా కళ్ళేలు నీ చేతిలో వున్నాయ్యో ఆ నెత్తురుగుడ్డుకేం తెలుసు? అయ్యో అంతా నీకు తెలుసు భగవాన్. నీకంతా తెలుసు.
ఒహో, ఆపద్భాంధవా!
ఆపదొచ్చినప్పుడల్లా నిన్నెప్పుడూ మరవలేదు. నా అపదలన్ని తీర్చింది నువ్వుగాదూ. నీ అండలేకుండా యీ సంసారనావని యీదగలిగేదాన్నా నీకు తెలియదూ - అయితే భగవాన్ నిన్ను పొగుడుతున్నాననుకోకు. ఈ అపదలన్ని ఇంత తెలికగా చిక్కుతీస్తావే! ఇదంతా మాయేనా? ఇదంతా నాకెందుగ్గాని, యిలాగే వస్తాను భగవాన్. తలంటుకుని, చాకలి మడతవిప్పి, కట్టుకుని, కుంకం పెట్టుకుని, చిక్కు వీడని జుట్టుతో - నీకు తెలియదు గనకనా ఇట్లాగే నీ ముందేట్లా కూర్చున్నానో అట్లాగే అచ్చంగా అట్లాగే - వస్తున్నాను, వస్తాను, ఆయనేమంటారో తెలుసా భగవాన్. మీదగ్గరకు వచ్చినఫ్ఫట్లోఉన్న ఉత్సాహంలో వెయ్యోవంతుగూడా ఉండదట ఆయన్ని చూసినప్పుడు. వొట్టి కొంటి మనిషి భగవాన్. ఆయన యెన్నెనోళ్ళోచ్చినా పెళ్ళిడూకొచ్చిన మనవాడున్నాడనైనా మానరు ఆ మాటలు. నీకు తెలుసుగా ఆయన నైజం. అంతే. యెప్పుడూ అంతే.
యెన్ని సార్లు చెప్పానని? యే వయసుకు ఆ మురిపెం ఉండాలని.యీడు దాటితే కోట దాటుతారు. ఆ చిరంజీవికి మూడుముళ్ళు వెయ్యండి అని యెన్ని సార్లు చెప్పాను! యెన్ని సార్లు- వింటేనా? చెవిని యిల్లు కట్టుకుని పోరాను. ఊహూ!
నీ పెళ్ళికి ముందు మీ అమ్మనీ అయ్యనీ నిద్ర పోనిచ్హావని నాకు నమ్మకం లేదు అంటారుగదా! భగవాన్! దానికి దీనికి ఏమన్నా సంబంధం వుందా, నువ్వే చెప్పు భగవాన్?
నాకు అమ్మా, అయ్యా వున్నారుకాబట్టి సరిపోయింది! వాడికి అమ్మా? అయ్యా? వాడు కళ్ళు తెరవకముందే నీ దగ్గిరకు వచ్చారు గదా?
హా సృష్టిలయకారణా!!
నీకు తెలుసునుగా - ఒక్కగాను ఒక్క ఆడబిడ్డ మనవణ్ణీ కన్నది గదా అనుకుంటే యిట్టే యెత్తుకునిపోతివి - ఈ దేవుడరుగుముందు కూర్చుని యెంత యేడ్చాను. యేం లాభం? నీ గుండె కరగ లేదు.
నాకు తెలుసు, నీ గుండె వెన్నపూసలాంటిదని - యేం లాభం? అదంతా నీ ఇష్టం అనుకుని అల్లుణ్ణి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆయన్నీ అంతే చేస్తివి - పిల్లణ్ణి చూసుకుని యింట్లో పెట్టుకుంటే భోరున యేడ్చాడు. మీకు అప్పగించి వెల్తున్నానని చెరువైపొయ్యాడు. వాడి కోసం పెళ్ళిమానుకున్నానన్నాడు. పెళ్ళి చేసి ఒక యింటివాడ్ని చెయ్యండని గడ్డం పుచ్చుకున్నాడు. నీకు తెలుసుగా..అప్పుడే నీ దగ్గిరకి పరిగెత్తుకొచ్చానుగా - యేం లాభం!
హూ! హే భగవాన్!
నిన్నేమి అనటంలేదు. ఏమని యేంలాభం! అప్పటికే అన్ని అయిపొయ్యే. నువ్వు మాత్రం యేం చెయ్యగలవ్. మంచివాళ్ళకీభూమ్మిద నూకలుండవని నువ్వేగదా అన్నది. అన్నమాటమీద నిలబడవద్దా అనుకున్నాను. అంతే భగవాన్, నిన్ను తిట్టాలేదు, తిమ్మాలేదు. యేమి అనలేదు.
అయితే వాడు - అదే - మా చిరంజీవి పెళ్ళిచేసుకోనంటాడు గదా. యిదేం ఖర్మ భగవాన్! నా మాట మర్చిపొయ్యావా భగవాన్! అందరూ నన్ను ఉమ్మేస్తున్నారు. నీకేం. ఆ దేవుడరుగుమీదనుంచుని సాంబ్రాణిపొగ కళ్ళల్లోకొస్తున్నా అట్లాగే నవ్వుతుంటావయ్యే - అయ్యో! - అయ్యో. నీ తలంతా అదేంటి నల్లగా కరిధూపం!
ఇక్కడేమి మసిగుడ్డకూడాలేదు. యేం ఫరవాలేదు. నా చీర చెరగుతో తుడుస్తాను. కొంగుతో కొత్త చీర కొంగుతో తుడిచాను. చూసావా నువ్వంటే నాకెంత భక్తో!
ఆ! విన్నావా? యీ విడ్డూరం విన్నావా? పెళ్ళి చేసుకోకుండా మీ తాత వున్నాడా, మీ తండ్రి వున్నాడా? ఎవరన్నా పెళ్ళి చేసుకోం అన్న వాళ్ళని చూసారా అంటే సంత పాకల్లో వందల కొద్ది ఉన్నారంటాడు! అని వూరుకోడు, నవ్వుతాడు. పెళ్ళిచేసుకోనివారు బోలెడు మంది వున్నారంటాడుగదా, యెట్లా భగవాన్?
నేను వూరుకోలేదు భగవాన్. నీకు తెలియదూ. నేనూరుకుంటానా? వూరుకుంటే యెట్లా? వూరుకోవాలట! యెట్లా వూరుకోకేం! వాళ్ళకి పిల్లలిస్తామన్నవాలేర్రా, నీకేం రారాజువి. పిల్లని, పిల్లతో పాటు కట్నాన్ని యిస్తామన్నవాళ్ళు కో అంటేఅ కోటి మందిరా అన్నాను. ఒక్క అమ్మయినేగా చేసుకునేది, మిగతావాళ్ళందరూ ఏమౌతారంటాడు. యీ కాలపు పిల్లలికి నువ్విచ్చిన తెలివేనా అది భగవాన్? అంతా తెలిసి యింత అయోమయాన యెలా పడ్డావ్ భగవాన్?
నా ఒఖ్ఖ మాటే కాదు ఎవరి మాటన్నా ఖాతర్లేదు. వాళ్ళ పెదనాన్న వచ్చి వంశాన్ని నిలబెట్టవురా అని అడిగితే నా పొలం కట్టుబడి చాలటంలేదా అని అడిగాడు. వాళ్ళ పిన్ని వచ్చి మీ అమమ్మ ముఖమైన చూసి చేసుకోరా ఆ మూడు ముళ్ళూ చూసి కన్ను మూయాలనుకుంటోది అని అంటే అమ్మమ్మని ఇంకో పదికాలాలాపాటు బ్రతకనీయండి, ఇవ్వాళే పెళ్ళి చేసుకుంటే రేపే కళ్ళు మూస్తుందేమో అని అంటాడు. చెల్లెలుని కళ్ళల్లో పెట్టుకుంటాడు. వదెన్ని చూడాలని ఉందంటే పట్టు చీర పట్టుకొస్తాలేమ్మా అని అంటాడు.
యేమిటి భగవాన్! యిదంతా? యెవరి మాటకి..యెన్నడూ ఎదురు చెప్పని వాడికి యిదేమి గుణం? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ గుణం తీసెయ్యి బాబు. నీ సంకల్పంలేనిదే గడ్డిపూచ కూడ కదలదుకదా!
అయ్యో కారణకారణా!
నాకు తెలీకడుగుతాను, ఇవ్వన్నీ నువ్వే అనిపిస్తున్నావా వాడితో!ఒహో! చిదచిద్విలాసా!
ఈ మహాకల్పనతో మాయకట్టు కట్టి నాటకమాడిస్తున్నావా నళిననేత్ర! ఆడిన నాటకం చాలదూ..అసలు ఆ మాటే మర్చిపోయాను. యీ ఆట కట్టిపెట్టు మహానుభావా!
నాకు తెలియదూ..మా చిరంజీవి సంగతి, నోరు తెరిచి యెరగడు. అలాంటి వాడు మాటల పుట్టయిపోయే. పెళ్ళి చేసుకోవటమంటే మాటలు కాదంట. పెళ్ళాన్ని పోషించాలంట. (అదెవళ్ళకు తెలియదో! చేసుకున్నవాళ్ళందరూ పోషించటంలా? బ్రతికనంతకాలమూ పొరపచ్చాలేకుండా బ్రదకాలంట. మేమంతా బ్రతకటంలా? ఆయనా నేను ఎన్నిసార్లు పోట్లాడుకోలేదు? మళ్ళీ మాట్లాడుకోలా! మళ్ళీ క్రిందా మీద పడలా?)
ఒకళ్ళ గుణాలు వొకళ్ళకి తెలియాలట! ముందు బాగా తెలిసివుండాలట. (వాడు చిన్నప్పటినుంచి యెరిగినవాళ్ళూ యెంత మంది లేరు? ఒట్టి పిచ్చివాడు. యెంతమంది స్నేహితులనుకున్నాడు. యెంతమంది మోసపుచ్హారు. ..జేబులో పదిరూపాయలనోటేసి కెళ్ళితే ఇంతటికొచ్చేటప్పటికి రాగి దమ్మిడి వుండదే? ..వున్న గుణాలు మారవు పిచ్చి కాని..తెలీని గుణాల్ని సందేహించాడు. మారిన గుణాల్తో మెలగ్గలుగుతాడా?)
యెందుకొచ్చిన మాటలూ యివన్నీ? కూటికా? గుడ్డకా? యెందుకివన్ని నేర్పావు భగవాన్ యివ్వని వాడికి?
యెం చెప్పినా వినడయ్యె, యెట్లా భగవాన్? నీకు పుణ్యం వుంటుంది, ఆ శంఖం వూదుదు, ఆ చక్రం తిప్పుదూ, ఆ గద తిప్పుదూ, ఆ చిరునవ్వు మానుదూ.
అయ్యో! అయ్యో! ఇదేంటి, ఇట్లాగా నేను ప్రార్ధించాల్సింది? అయ్యో! అయ్యో!
ప్రొదెక్కింది, ఆయనొచ్చేవేళయింది. విసిగెత్తుతోంది భగవాన్. ఇంకేమి లేదు. ఆ! విన్నావా! నువ్వు వినకేం. నీకు వినపడనిదేముంటుంది కనక! వూళ్ళొ వాళ్ళేమనుకుంటున్నారో విన్నావా? అది సాగితే ఇదేందుకు? అంటున్నారు. పాపం, ఆ బిడ్డని పట్టుకుని అట్లా నోటికొచ్చినట్లల్లా అంటారుగదా భగవాన్, ఏమనాలి వాళ్లని?
తల్లీ తండ్రీలేని అనాధుణ్ణి అట్లా అందరి నోళ్ళళ్ళో పడేస్తే పుణ్యమా? పురుషార్ధమా? నీకు తెలుసునని నాకు తెలుసు భగవాన్!
యెన్నెన్నో పడ్డాను, యెన్నెన్నో భరించాను. ఇంక నా వల్ల కాదు. యీ పాడు కాలంలో బ్రతకలేను. నన్నేతుకుపో నాయనా, నాకింకా నూకలున్నాయా? అయితే నా మనమడికి, చిరంజీవికి ఆ మూడుముళ్ళు పడేటట్టు చూడు బాబూ.
ఆయనొచ్చేవేళయింది. ఆ వొచ్చేవాళ్ళ పిల్లనన్నా చేసుకునేటట్లు చూడు భగవాన్. ఆ పిల్ల చక్కని చుక్క. గోదేవి లాంటిది. వాళ్ళూ వున్నవాళ్ళూ. కట్నమిస్తారు. వెండి సామాను పెడతారు, వాడు యిష్టపడితే చాలు. కాస్త యిష్టపడమని చెబుదూ, ఇన్ని మాటలనిపించినవాడివి, ఆ ఓక్ క్ ఖ మాట అనిపించలేవూ?
నాకు తెలుసు, అంతా నీకు తెలుసు, నీకు తెలుసని, నాకు తెలుసు. నాకు తెలుసు. నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. ఏకాదశి చెయ్యనా? శనివారం వుండనా? అన్నీ చేస్తాను. ఆ వొక్క మాట నెగ్గించుదూ, కావల్సినన్ని కొబ్బరికాయలు కొడతాను.
పెళ్ళి కాగానే వారిద్దరితో మ్రొక్కిస్తాను. అంతా నీదే. నీవు మ్రొక్కించుకోవాలంటే మ్రొక్కనివాళ్ళేవరు?
అంతే, నేను కోరేది దేవుడా! అలా, ఆ! సురుచిర మందహాసం!
సర్వాంతర్యామి! చరా చర స్థితిలయకారణా! ఆపద్భాంధవా! కారణగారణా! చిదచిద్విలాసా! మహానుభావా! ఓ దేవుడా!
హే! భగవాన్! యీ చిక్కులో చిక్కుకున్న చిక్కును విడదియ్యవూ?

(ప్రచురణ కాలం 1954)
కధకుడు: అట్లూరి పిచ్చేశ్వరరావు.
(1925 ఏప్రిల్ 12 - 1966 సెప్టెంబర్ 26)
(1925 ఏప్రిల్ 12 - 1966 సెప్టెంబర్ 26)
No comments:
Post a Comment